తెలంగాణ ప్రభ (కోరుట్ల): మహిళా దినోత్సవంను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు కోరుట్ల మున్సిపాలిటీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి స్వయంగా పాల్గొని మహిళలకు హెల్త్ చెకప్ లు చేయించడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పట్టణ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ్య మహిళ చేసే సేవలు మరువరానివని వీరు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.
కావున ప్రతి ఒక్కరూ వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మరియు మున్సిపల్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, మహిళా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు
.