కోరుట్లలో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): బిజెపి ఆధ్వర్యంలో శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ రావు, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ సమక్షంలో కోరుట్ల శక్తి వందన్ కన్వీనర్ సుదవేని మహేష్ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మండపం అయిలాపూర్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

మహిళలంతా కమలంతో జోడు కట్టి మరొక్కసారి ప్రధాని మోడీని గెలిపించుకుంటారని, గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరాలుగా మారాయని, ప్రతి పేద కుటుంబానికి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ప్రతి పేద ఇంటికి శాశ్వత మరుగుదొడ్డి నిర్మాణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇండ్లు, దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల పైన ఇండ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్య బీమా పథకం, ఉచిత రేషన్, సుకన్య సమృద్ధి యోజన ద్వారా బాలికలకు ఆర్థిక లబ్ధి, జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా రెండు లక్షల బీమా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, వందలాది సంక్షేమ పథకాలను గత పది సంవత్సరాల్లో మోడీ అమలు పరిచారని వారు పేర్కొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు 

బింగి వెంకటేశ్, జిల్లా ప్రధాాన కార్యదర్శి యధాగిరి బాబు, కార్యదర్శి పీసరి నర్సయ్య, గంగారం, అధికార ప్రతినిదులు తిరుమల వాసు, లక్ష్మినారాయణ, గుగ్గిళ్ళ తుక్కారాం,సీనీయర్ నాయకులు రుద్ర శ్రీనివాస్, జక్కుల జగదీశ్వర్, మిట్టపెల్లి కృష్ణ మూర్తి, ఆకుల రంజిత్ పట్టణ ప్రధాన కార్యదర్శ చెట్లపెల్లి సాగర్, BJYM పట్టణ అధ్యక్షులు కలాల సాయి చందు, BJYM జిల్లా కార్య దర్శి సాదిగె మహేశ్, ముల్క అంజనేయులు, IT సెల్ నాయకులు ఇట్యల నవీను, ఎర్ర రాజెందర్, చెట్టిపెల్లి ఓం ప్రకాశ్, దమ్మ సoతోషు, ఛాంద్ పాషా, దుర్గ ప్రసాద్, వడ్ల కొండ శ్రీనివాసు,సాయి కృష్ణ, ఎడమన పెళ్ళి సాయి, కoటం రమణ, తదితరులు పాల్గొన్నారు.

.