తెలంగాణ ప్రభ (నిజాంపేట్) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొన్ని అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు అండగా వుంటూ అక్రమ నిర్మాణాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారని విమర్శలు వెళ్ళువెత్తుతుండగా కొన్ని అనుమతి లేని బహుళ అంతస్థుల భవన నిర్మాణ యజమానులకు స్థానిక నాయకులు అండగా వుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది ప్రదానంగా ప్రగతినగర్ 191ఎన్టీఆర్ నగర్ రోడ్ ఒకటో నెంబర్ రోడ్డు ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతి లేకుండా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.. సదరు నిర్మాణదారుడినుండి ముందస్తుగా ముడుపులు అందాయా లేక స్థానిక నేతలు అధికారులను అటువైపు రాకుండా నియంత్రిస్తున్నారో కానీ ఆ అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు.ఏది ఏమైనా ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతూ ఇలా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేలా మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహారించడం పట్ల స్థానికంగా విమర్శలు వెళువేతుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవలని స్థానికులు కోరుతున్నారు.
