తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణ బిఆర్ఎస్ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుక్కల శ్రీకాంత్( టిల్లు) నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, పట్టణ యువమోర్చా అధ్యక్షులు కొత్తకొండ వినీత్ గౌడ్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, ఉపాధ్యక్షులు గాదస్ రాజేందర్ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.