మెదక్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రాజ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): అదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా  విధులు నిర్వహిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వంచే నియమించబడిన రాహుల్ రాజ్ బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో మెదక్ జిల్లా ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, ఆర్డీవో రమాదేవి, కలెక్టర్ కార్యాలయ ఏవో 

M.D యూనిఫ్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో ఎల్లయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ నరసింహులు, ఏ.డి మైన్స్ జయరాజ్, ఇతర శాఖల అధికారులు కలిసి  పుష్పగుచ్ఛం అందించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, ప్రజా పాలన కార్యక్రమం అమలుతీరు, ధరణి, జిల్లాలో తాగునీటి సమస్య, ఏడుపాయల జాతర నిర్వహణ విధానం వైద్య,  ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, భూసేకరణ, ప్రజావాణి కార్యక్రమం తదితర  అంశాలపై చర్చించారు.

.