కోలెంట్ పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు మృతి ప్రమాదాలకు అడ్డగా మారుతున్న కోలెంట్ పరిశ్రమ గ్రామస్తుల ఆరోపణలు

కోవలంట్ పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బాధిత కుటుంబీకులు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్మికులు

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలో గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో గల కోవలెంట్ పరిశ్రమలో మంగళవారం నాడు అర్ధరాత్రి రియాక్టర్ పేలడంతో హత్నూర గ్రామానికి చెందిన వినోద్ కుమార్ 30 అదేవిధంగా జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులు సాదిన్, ఫాదర్ మారండి, బాబు, మృతి చెందారు ఈ ప్రమాదం పరిశ్రమ భద్రత లోపం కారణంగా బంధువులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా పరిశ్రమ ఎదుట ఆందోళన నిర్వహించారు ఇప్పటి వరకు స్పందిచని యాజమాన్యం నిన్న జరిగిన స్పందించకపోవడం చాలా బాధాకరమని బంధువులు ఆరోపిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశ్రమపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని బంధువులు చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు ఈ ధర్నాలో ఎమ్మార్పీఎస్ నాయకులు చుట్టుపక్కల గ్రామస్తులు బంధువులు పాల్గొన్నారు బాదిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు పోరాడుతామని వారు తెలిపారు

.