తెలంగాణ ప్రభ(ధర్మపురి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం 63వ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ను అమలు చేసినప్పుడు వద్దని కేసులు వేసిన వారే నేడు ఎల్ఆర్ఎస్ ను అమలు చేయడం ఏంటని దీనిని వెంటనే రద్దు చేయాలని దీంతో ప్రజలకు భారం పడుతుందని వారు తెలిపారు.ధర్నా రాస్తా రోకో తో రోడ్డు కు ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. ఎస్ఐ ఉదయ్ కుమార్ చేరుకొని రాస్తారోకో ను విరమింపచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కినపెళ్లి సునీల్,నాయకులు ఒడ్నాల మల్లేశం,చిలువేరి శ్యాం,కొండపల్లి సుధాకర్,గడ్డం బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
