కేకే మహేందర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్
దమ్ముంటే ఇప్పుడు సిరిసిల్ల నుంచి పోటీ చేసి గెలవాలంటే కేటీఆర్ కు సవాల్.
తొమ్మిదో ప్యాకేజీని విస్మరించి పంటను ఎండ కొడుతున్నావు.
పార్లమెంట్ ఎన్నికల కోసం చెబుతున్న మాటలను ప్రజల నమ్మరు.
బిఆర్ఎస్ కు ఒక సీటు కూడా రాదు.
తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల): సీఎం రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోవని సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కే కే. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మరోసారి రేవంత్ రెడ్డి పై విమర్శించి లబ్ధి పొందాలని చూస్తున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోని కేటీఆర్ విమర్శలను తప్పు పట్టారు. సిరిసిల్ల నియోజకవర్గనికి ప్రత్యేకంగా కేటీఆర్ చేసింది ఏమీ లేదని అన్నారు. జిల్లా ఏర్పడదని చెప్పిన ప్రజలు పోరాడి సాధించుకున్నారని జిల్లా ఏర్పడడం వల్ల మెడికల్ కాలేజీ తో పాటు జిల్లాకు రావలసినవి వచ్చాయని అన్నారు. సిరిసిల్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏమైందని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేకపోయినా కేటీఆర్ ఆఖరికి మునిసిపల్ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి తీసుకు వచ్చారని విమర్శించారు. మూడుసార్లు ఓడిపోయిన తాను ప్రజల మధ్య ఉన్నానని అన్నారు. దమ్ముంటే కేటీఆర్ ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందని సవాలు విసిరారు. సిరిసిల్ల పద్మశాలియుల పట్ల గౌరవం ఉంటే తక్షణమే గతంలో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పద్మశాలి సామాజిక వర్గం పట్ల ప్రేమ ఉంటే బతుకమ్మ బకాయిలు ఎందుకు మిగిలిపోయాయే సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా నిలబడి సొంత ఆస్తిని ఇచ్చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ప్రజలు పోరాడాల్సిన పరిస్థితికి కేటీఆర్ కారణం కాదా అని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గనికి సాగునీటిని అందించే తొమ్మిదవ ప్యాకేజీ పనులను చేయకుండా నీటిని తరలించకపోయి నియోజకవర్గంలో పంటలు ఎండిపోవడానికి కేటీఆర్ కారణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అనవసరమైన విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గోనే ఎల్లప్ప, గడ్డం నరసయ్య, గాజుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
