వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల):అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని  బుధవారం రోజున కోరుట్ల వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో  వాసవి మాత దేవాలయంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. 

ఉదయము 10 గంటలకు వాసవి మాత పారాయణంతో ప్రారంభించి, ఆటలు, పాటలు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేసారు. క్లబ్ అధ్యక్షురాలు బూస మాధురి మాట్లాడుతూ యాత్ర నార్యాస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత! ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని ఆమె అన్నారు. బాలికలు మహిళలపై జరుగుతున్న హింస గురించి వివరిస్తూ, వాటిని అరికట్టే విధానాలను గురించి ఆమె వివరించారు. అలాగే గృహహింస నుండి రక్షణ కల్పించడం, వరకట్నం వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అత్యాచారాన్ని అరికట్టడం గురించి టోల్ ఫ్రీ నెంబర్స్ 181,1098 అందుబాటులో వున్నాయని ఆమె అన్నారు. 

కార్యక్రమ చివరలో బహుమతుల ప్రధానం అనంతరo మహిళలు కేక్ కటింగ్ చేసారు. 

ఈ కార్యక్రమములో  వెలుగూరి భాగ్యలక్ష్మి, జనగం మధురిమ, జిల్లా విజయలక్ష్మి, మంచాల పద్మ, కొత్త కవిత, గరిపెల్లి మాధవి. గంప రమాదేవి, లింగం సుజాత, కముటల అనిత మహిళలు పాల్గొన్నారు.

.