ఆకట్టుకున్న రామక్రిష్ణ డిగ్రీ & *పిజి కళాశాలల వీడ్కోలు వేడుకలు ...

తెలంగాణ ప్రభ (కోరుట్ల):జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రామక్రిష్ణ డిగ్రీ&పిజి కళాశాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు  "అల్విదా 2024" ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి  మాట్లాడుతూ విద్యార్థులు  క్రమశిక్షణ గా ఉంటూ ఉన్నత విద్యను చదివి సమాజంలో మార్పు తీసుకు రావాలని ఆయన కోరారు.

కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ  మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా జీవితంలో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి . 

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, సానిటరీ  ఇన్ స్పెక్టర్ గజానంద్, కళాశాల కరస్పాండెంట్ యాద రామ కృష్ణ , డైరెక్టర్ హరిప్రియ అంజయ్య గౌడ్, రామకృష్ణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సకినాల రాజు ,డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్,  అధ్యాపకులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

.