మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : రాష్ట్ర మున్నూరు కాపు సంఘాలు డిమాండ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల):మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు ఐక్యంగా డిమాండ్ చేశాయి.

సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్.వి.ఎల్.ఆర్.గార్డెన్స్ లో జిల్లా మున్నూరు కాపు సంఘము ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య తదితరులు మాట్లాడుతూ  తెలంగాణలో వ్యవసాయమే ప్రధాన వృత్తి గల మున్నూరు కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  ఆయన  కోరారు., 

రాష్ట్ర సెక్రెటరీ జెనెరల్ హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని,మున్నూరు కాపు కులంను బీసీ.డి నుండి తీసి వేసి బీసీ ఏ గ్రూప్ లో చేర్చాల్లన్న డిమాండ్లని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు.

జిల్లా అధ్యక్షుడు బాదినేని రాజేందర్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో మున్నూరు కాపులకు సంఘ భవనాలు,హాస్టళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు ,నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏడ్ల రవి,సంజీవ్,వొడ్నాల రాజ శేఖర్,జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి రాజ్ కుమార్,కోశాధికారి దీటి అంజయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాదా కృష్ణ, కథలాపూర్ మండల ఆద్యక్షుడు చెదలు సత్యనారాయణ,నాయకులు జిల్లా,మండలాల ప్రతినిధులు  పాల్గొన్నారు.

.