తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నియోజకవర్గంలోని హత్నూర మండల్ లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గానికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సునీతమ్మ స్వచ్చంద సేవ సంస్థ ద్వారా ద్వారా దివ్యాంగుల సదరం క్యాంపు ప్రారంభం చేయడం జరిగింది దరఖాస్తు స్వీకరణకై దివ్యాంగులకై దిక్సూచి యాత్ర పేరుతో అర్హులైన దివ్యాంగుల ఇంటింటికి వెళ్లి నేరుగా ధ్రువ పత్రాల స్వీకరణ కార్యక్రమం ఈనెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు చేపడుతున్నట్టు అధ్యక్షుడు బి.వి.శివశంకర్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఏండ్ల తరబడి దివ్యాంగులుగా ఉంటూ సదరం క్యాంపు కొరకు మీ సేవలో స్లాట్ బుక్ అవ్వక ఎన్నో వందలసార్లు మీ సేవ చుట్టూ తిరుగుతున్న వారిని గుర్తించి స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అర్హులైన దివ్యాంగుల ఇంటికి వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని ఉచితంగా మీ సేవలో స్లాట్ బుక్ చేయించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సదరం క్యాంపుకు తీసుకెళ్లి సర్టిఫికెట్ మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటారన్నారు. ఈ యాత్ర హత్నూర మండలంలోని తెల్ల రాళ్ల తండా నుండి ఈనెల 3 తేదీ సోమవారం నుండి13 బుధవారం వరకు 10 రోజులపాటు రోజుకు 4 గ్రామాల చొప్పున కొనసాగుతుందన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
