జీరో కరెంట్ బిల్లు చారిత్రాత్మకం : కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి

త్వరలో రైతులకు రుణమాఫీ

కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం

సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి

తెలంగాణప్రభ (నర్సాపూర్) నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు ఇవ్వడం చరితాత్మకమని త్వరలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అంతేకాకుండా గృహ అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీరో బిల్లుతో ప్రతి కుటుంబానికి విద్యుత్ అవసరం తీరుతుందని ప్రతి కుటుంబానికి కరెంటు అందుతుందన్నారు.ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు స్వీకరి అంటూ అమలు పరచడము సంతోషకరమన్నారు. అంతేకాకుండా ఆరు గ్యారెంటీల ఆమాలు దిశగా ప్రభుత్వం ముందుకు పోవడము గర్వపడుతున్నామన్నారు. గత పాలకులు ఇచ్చిన హామీలను పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క ఆమీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా గాలికి వదిలేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.గొర్రెలు బర్రెలు చేపల చెరువులు అనుకుంటూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనంతరం నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి గొప్ప మాసను చాటుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు అంతేకాకుండా ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీకు నా జీతాలు వేసి కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చాటుకుందన్నారు.

.