కోరుట్లలో అలరించిన గౌతమ్ మోడల్ స్కూల్ ఫేర్వెల్ పార్టీ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాలలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ విద్యార్థుల కేరింతలు నృత్యాలతో సందడిగా మారింది. ప్రిన్సిపల్  ప్రవీణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చక్కని ప్రాణాలికతో ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలని ఉపాధ్యాయులు సూచించిన విధంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని, ర్యాంకులతో పోటీ పడకుండా సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ పెంచుకోవాలని ఆయన సూచించారు.  అనంతరం ఫేర్వెల్ పార్టీ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్, అధ్యాపకులు డిశానిర్దేశం చేశారు. విద్యార్థులు 25 ఏళ్ళు కష్టపడితే 75 సంవత్సరాలు సంతోషకరమైన జీవితం అనుభవించవచ్చని, మీ బంగారు భవిష్యత్తుకు పదవ తరగతిలో మూలాలు ఏర్పడతాయని, తరగతి గదిలో పాఠశాలలో చేసిన అల్లర్లు తీపి గుర్తులుగా మిగిలిపోతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు చేసిన అల్లర్లని స్వరూప రాణి మేడం పాట రూపకంగా పాడటంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందంలో మునిగిపోయారు.  


ఈ కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల చైర్మన్ వెంకట నారాయణ, డైరెక్టర్ శ్రీకాంత్, డీన్ నరసింహరాజు, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

.