ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసిన కోలన్ : హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ఆశయం అని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొండంత భరోసా ఇచ్చేలా పని చేస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అన్నాడు. ఆదివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో పునరుద్ధరణ చేసిన ఇందిరాగాంధీ  విగ్రహాన్ని ఆయన  ఆవిష్కరించి 

అనంతరం కాంగ్రెస్ జెండాను ఎగరవేసాడు.ప్రధాన రహదారి పై చాలా కాలంగా పాక్షికం గా ధ్వంసమై వున్న ఇందిరా గాంధీ విగ్రహన్ని కాంగ్రెస్  నేత కొలన్ చొరవ తో పునరుద్దరణ చేసి ఆవిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శామీర్పేట్ ప్రకాష్ రావు, ఆకుల ప్రేమ్, సురారపు కృష్ణ, పి. మహేందర్ రెడ్డి, వంశీ కృష్ణ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్, గండిగూడెం మల్లేష్  కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

.