రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఏరియా ఆసుపత్రిలో జ్యోతి ప్రజ్వలన చేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్న పిల్లలకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. పోలియో డ్రాప్స్ వేసేందుకు మొబైల్ టీంలు ట్రాన్స్లేట్ పాయింట్లలో చుక్కల మందు పంపిణీ జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు.
బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలను వేయాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఎంఆర్ఎఫ్ సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ నుండి అందించిన మూడు అంబులెన్స్ లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ సుధీర, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి గాయత్రి, డిఐఓ శశాంక్, డిసిహెచ్ సంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఎంఆర్ఎఫ్ ప్రతినిధులు బివియన్ పాటిల్, షిబు శ్యామ్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
.