పల్స్ పోలియోను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ పడిగల మానస రాజు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); పల్స్ పోలియోను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పడిగల మానస రాజు కోరారు. ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ దేవస్థానంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ మానస ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... మన రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిండు ప్రాణానికి రెండు చుక్కలు అనే సంద్రంగా (05)సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ఈ పోలియో చుక్కలు వేయించలేని పిల్లలకు మరో రెండు రోజుల పాటు ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించలేని పిల్లలందరికీ ఇంటి వద్దనే వేస్తారని అన్నారు. చిన్నపిల్లల్లో అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలను ప్రవేశపెట్టడం జరిగిందని, (05)సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ, ఏఎన్ఎంలు సంతోష, హెల్త్ విజిటర్ జయ, ఆశా వర్కర్లు భారతవ్వ, ఆఫీజా, మానస తదితరులు పాల్గొన్నారు

.