మెదక్ ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వండి

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కోరిన బీరయ్య యాదవ్

తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కలిసి తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు.2001 నుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, తెలంగాణ భావజాల వ్యాప్తికోసం అహర్నిశలు శ్రమిస్తు, ఎన్నో లాఠీ దెబ్బలు,ఎన్నో కేసులు .ఉమ్మడి మెదక్ జిల్లాలో బిసి నేత గా మంచి గుర్తింపు ఉందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై కొట్లాడే వ్యక్తినని తెలిపారు. బిఆర్ఎస్ అదిష్టానం పార్టీ అభ్యర్థి గా తనకు అవకాశం కల్పించేలా కృషి చేయాలన్నారు.ఈ విషయమై పద్మా దేవేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని బీరయ్య యాదవ్ తెలిపారు.మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా తాను అందరికి సుపరిచితుడినని, తనకు అవకాశం కల్పిస్తే మెదక్ పార్లమెంట్ పై గులాబీ జెండా ఎగురావేస్తానని అయన దీమా వ్యక్తం చేశారు.

.