పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత-గంగాధర్ గౌడ్                                   

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని  13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత-గంగాధర్ ప్రజలను కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం పోలియో రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వపరంగా 0-5 సంవత్సరాల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వార్డులోని గడి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కౌన్సిలర్ తిరుమల వసంత-గంగాధర్ మాట్లాడుతూ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంతో పోలియో వ్యాధి రాకుండా ఉంటుందన్నారు. ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. అలాగే 15వ వార్డులోని బస్తీ దావాఖనలో వార్డు కౌన్సిలర్ ఆడెపు కమల చిన్నారులకు చుక్కల మందు వేశారు ఆదివారం రోజున పోలియో చుక్కలు వేయించుకొని వారికోసం ఆరోగ్య సిబ్బంది వార్డుల్లో ఇంటింటికి పర్యటించి  చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారని వారు అన్నారు.ఎవరైనా వేసుకొని వారు ఉంటే అంగన్వాడి, ఆశా వర్కర్లకు  సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, అంగన్వాడి టీచర్ హిమగిరి, ఆశా వర్కర్ భారతి, అంగన్వాడీ టీచర్, ఏ లక్ష్మి, పుష్ప లత, రమదేవి, ఆశా వర్కర్ ఏ జ్యోతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడేపు మధు, ఎం ఎం అలీ బేగ్, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

.