ఎమ్మెల్యే కేపీ వివేకానంద
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎమ్మెల్యే కేపీ.వివేకానంద పల్స్ పోలియో కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ బాపునగర్ లో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాజీ కార్పొరేటర్ కే.ఎం. గౌరీష్ తో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండైన జీవితానికి రెండు చుక్కలు విధిగా వేయించడం మన బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, కిషోర్ చారి, బాపునగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దూదిమెట్ల కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బాబు, దేవాలయ కమిటీ సభ్యులు సుబ్బారావు, కాలనీవాసులు శ్రీనివాస్, శ్రీధర్, రాజు, మల్యాద్రి, గాంధీ రెడ్డి, బాల్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, దేవేందర్, పల్స్ పోలియో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
