తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలోని శ్రీ సీతారాముల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు సీతారామచంద్రులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు కృష్ణారావుకు స్వామివారి తీర్థ ప్రసాదం వితరణ చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు కృష్ణారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీ రితోపాటు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పెరుమాండ్ల సత్యనారాయణ, కో రుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఏలేటి మహిపాల్ రెడ్డి, మ్యాకల నర్సయ్య, చేపూరి కృష్ణారెడ్డి, పడాల లచ్చయ్య, బెజ్జారపు శ్రీనివాస్, అబ్దుల్ హఫీస్, ఇల్లేందుల రాజు తదితరులు ఉన్నారు
.