కోరుట్ల పట్టణంలో "పల్స్ పోలియో కార్యక్రమాన్ని" ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 27వ వార్డ్ లోని విశ్వబ్రాహ్మణ సంఘంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా చైర్  పర్సన్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ఉన్నటువంటి అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల వయస్సు (0-5 సంవత్సరాలు) ఉన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించి పోలియో భారీ నుంచి పిల్లలను రక్షించాలని ఆమె కోరారు

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య 27వ వార్డు కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ డా" అనిల్, హెల్త్ సూపర్వైజర్ జి. దనుంజయ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపల్ మరియు  మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

.