తెలంగాణ ప్రభ (కోరుట్ల) కోరుట్ల నియోజకవర్గ కేంద్రం అయిన కోరుట్ల పట్టణంలో ఆదివారం రోజున జరిగిన మల్లన్న స్వామి జాతర ఉత్సవాల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమలగంగాధర్, పెరుమాండ్ల సత్యనారాయణ, మ్యాకల నర్సయ్య, సంగ లింగం, గాదెల అశోక్ రాజు, దండిక కిషోర్, బెజ్జారపు శ్రీనివాస్, అబ్దుల్ హఫీస్ తదితరులు ఉన్నారు
