జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి - లక్ష్మణ్
తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్ మోతె వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల శిబిరంలో ఆమె పాల్గొన్నారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ
పసి పిల్లల నిండైన జీవితానికి రెండు పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వేయించాలని, పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి అంగవైకల్యం రాకుండా ఉండేందుకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పోలియో చుక్కలు వేయించడం ద్వారా వాటిని నిర్మూలించడానికి అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆరోగ్య భవిష్యత్తు కోసం రెండు నిమిషాలు కేటాయించి, రెండు పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు.
పోలియో చుక్కల పట్ల ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వాటి వల్ల ఎలాంటి ఇతర అనారోగ్యాలు రావని అందుకే ప్రతి ఒక్కరూ విధిగా తమ పిల్లలకి పోలియో చుక్కలు వేయించడమే కాకుండా తెలిసిన వారికి కూడా చెప్పి వేయించాలని ఆమె సూచించారు. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పిల్లలందరికి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రజలు ముందుకు రావాలని ఆమె అన్నారు
ఈకార్యక్రమంలో DMHO పుప్పాల శ్రీధర్, డా. జైపాల్ రెడ్డి, UpHc సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.