అవినీతికి పాల్పడే వారి సమాచారం ఇవ్వండి : మన ప్రెస్ క్లబ్ కోరుట్ల

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని మన ప్రెస్ క్లబ్ కార్యవర్గం పిలుపునిచ్చింది. శనివారం కోరుట్ల పట్టణంలో నంది చౌరస్తా సమీపంలోని మన ప్రెస్ క్లబ్ కార్యాలయంలో  నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉరుమడ్ల శ్రీనివాస్, అల్లె రాము  మాట్లాడుతూ... మన కోరుట్ల ప్రాంతాన్ని అవినీతి రహిత ప్రాంతంగా తయారు చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వపరమైన సేవలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తమ బాధ్యతను గౌరవంగా నిర్వహించుకోవాలని వృత్తిని దైవంగా భావించుకొని ప్రజలకు సేవలు అందించాలని వారు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణం పరిసర గ్రామాల పరిధిలోని ప్రజలకు ఉపయోగపడే పనులు పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరగకుండా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలు నిర్భయంగా మన ప్రెస్ క్లబ్ కోరుట్ల కార్యవర్గానికి అందించినట్లయితే వాటిని పరిష్కరించేందుకు మన ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని, మీకు తెలిసిన అవినీతి అధికారుల, నాయకుల సమాచారం ఉంటే అందించి మీకు న్యాయం జరిగే విధంగా మన ప్రెస్ క్లబ్ పాత్రికేయులం వార్త కథనాల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని, మన కోరుట్ల ప్రాంతం లో ఏదేని అవినీతి, అక్రమాలు ప్రధాన సమస్యలు ఉన్నచో అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ సెల్ 9948864546, ప్రధాన కార్యదర్శి అల్లె రాము ఫోన్ నెంబర్ 9912435299 నెంబర్లలో సంప్రదించాలని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తు తరానికి ఉపయోగపడే ప్రకృతి వనరులను ఎవరి స్వార్థానికైనా వాడుకున్న వాటికి సంబంధించిన సమాచారం అందించి కోరుట్ల పట్టణ పరిసర గ్రామాల పరిధిలో ఉన్న ప్రకృతి వనరులను కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలని వారు కోరారు. 

ఈ కార్యక్రమంలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్షలు ఉరుమడ్ల శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి అల్లె రాము, గౌరవ సలహాదారులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు కొండ్లేపు అర్జున్, లింగ ఉదయ్ కుమార్, మిట్టపల్లి బుచ్చిరెడ్డి, గుడిసే కోటేశ్, వనతడుపుల నాగరాజు, బాలే అజయ్, గిన్నెల శ్రీకాంత్, మంచికట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు

.