తెలంగాణ ప్రభ(ధర్మపురి): వారంతా ఒకే క్లాస్ లో చదువు కున్నారు.తమ క్లాస్మేట్ కూతురు వివాహం కు అండగా నిలిచారు.1981 పదవ తరగతి బృందం మిత్రుడు పిల్లి మనోహర్ మృతి చెందగా ఇద్దరు కూతుర్లు చాలా బీద కుటుంబం రెండవ కూతురు పెండ్లి కొరకు మిత్రులంత కలిసి 56,310 రూపాయల ఆర్థికసాయం శనివారం అందించారు. ఈ సందర్భంగా 1981 మిత్ర బృందం కన్వీనర్ జక్కు రవి మాట్లాడుతూ గతంలో వివేకానంద,తెలంగాణ తల్లి విగ్రహ ల తో అనేక సేవ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి లక్ష్మి నర్సయ్య, ముత్తినేని గంగన్న,రాపర్తి రాములు,కోరుట్ల నరహరి,బొర్రా.శంకర్,బలిజేపల్లి వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు
