నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు, మంజీరా పైప్లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ లో దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, మంజీరా పైప్ లైన్ పనులను  శనివారం కుత్బుల్లాపూర్  ఎమ్మెల్యే కేపీ.వివేకానంద   డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద  మాట్లాడుతూ మన నగరాభివృద్ధి మన చేతుల్లోనే ఉందని, రానున్న రోజుల్లో మౌనిక వసతుల కల్పనకు మరిన్ని నిధులు కేటాయిస్తూ కుత్బుల్లాపూర్ లోని అన్ని ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. 

అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 99 లక్షల వ్యయంతో విజయ దుర్గ కాలనీ జిపిఆర్ లేఅవుట్ లో సీసీ రోడ్, 62లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యుఎస్ మంజీర వాటర్ పైప్ లైన్, 18లక్షల వ్యయంతో సింహపురి కాలనీ మెయిన్ రోడ్ గల టైల్కో నుండి సూర్య రెసిడెన్స్ వరకు సీసీ రోడ్, 47లక్షల వ్యయంతో రుద్ర కుటీర్ నుండి ప్లాట్ నె.20 రాయల్ విలేజ్ & లోహిత అపార్ట్మెంట్స్ వెనుకాల వరకు సీసీ రోడ్, 26లక్షల వ్యయంతో ఎస్విఎల్ఎన్ అపార్ట్మెంట్స్ నుండి సుమన్ నిలయం వరకు మరియు సాయి ఎలైట్ రెసిడెన్సీ నుండి ప్లాట్ నె.4,5 నుండి శ్రీ చైతన్య రెయిన్ బో క్యాంపస్ కాంపౌండ్ వాల్ వరకు సీసీ రోడ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే  చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నూతన భవన నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు స్థానిక మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద  శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, దుందిగల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, సీనియర్ నాయకులు  కోలన్ గోపాల్ రెడ్డి , కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నిజాంపేట్ బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు,  అనుబంధ కమిటీల సభ్యులు,సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

.