విద్యార్థులకు లింగాపూర్ పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించిన లింగాపూర్ సర్పంచ్ లక్ష్మీ మానయ్య

తెలంగాణ ప్రభ, ఎల్లారెడ్డిపేట: విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించిన లింగాపూర్ సర్పంచ్ లక్ష్మీ మానయ్య నర్సాపూర్ నియోజకవర్గంలో హత్నూర మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో శనివారం నాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా లింగాపూర్ సర్పంచ్ లక్ష్మి మానేయ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విద్యార్థులకు తాగునీటి సమస్య ఉన్నందువలన తమ దృష్టికి తెచ్చినందుకు ఈ సమస్యను పరిష్కరించినామని వారు తెలిపారు రాబోయే రోజుల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మల్లికార్జున చైర్మన్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు

.