మోటార్ సైకిల్ లకు, ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు రిమాండ్ కు తరలింపు

నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు ఎస్సై సుధాకర్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలంలోని బద్దెనపల్లి స్టేజి వద్ద ఇంటి ముందర పార్క్ చేసిన మూడు మోటార్ సైకిల్ లను తగలబెట్టిన కేసులో నిందితుడు రమన్నపల్లే కు చెందిన గడ్డం సాయి కృష్ణ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపైన వెళ్తూ తన ఇంటి ముందర పార్కింగ్ చేసి ఉన్న మూడు ద్విచక్ర వాహనాలు AP15BM4037 గ్లామర్, TS07GZ5635 స్ప్లెండర్, TS16FE 5572 పల్సర్ లను మరియు ఇంటి షట్టర్ లను, పెట్రోల్ తో తగలబెట్టి పరారయ్యాడని సీసీ కెమెరాలు చూడగా అట్టి నిందితుడు రామన్నపల్లికి చెందిన గడ్డం సాయి కృష్ణ అని తేలగా, ఇట్టి నిప్పు పెట్టడం వల్ల పది లక్షల నష్టం జరిగిందని అతనిపైన ఇంటియజమాని గుగ్గిల్ల అంజయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్న  ఎస్సై రామన్నపల్లి కి చెందిన నేరస్తుడు గడ్డం సాయి కృష్ణ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించే ప్రసక్తే లేదని చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

.