9 కోట్ల ముప్పై లక్షలతో నియోజకవర్గంలో అబివృద్ధి పనులు చేపడుతున్నాం

స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు

సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో 9 కోట్ల ముప్పై లక్షల రూపాయల తో నియోజకవర్గంలో  అబివృద్ధి పనులు చేపడుతున్నామని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తెలిపారు, 

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో శుక్రవారం 20 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ సందర్భంగా ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు,

ఈ సందర్భంగా కే కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగారం గ్రామంలో మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన అక్క చెల్లెళ్ల కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, 

అభివృద్ధి కార్యక్రమాల లో భాగంగా ఎన్ఆర్ జెసి కింద    మంజూరు అయిన రెండు కోట్ల రూపాయల నిధులతో  ఎల్లారెడ్డిపేట,  సింగారం,  బండలింగంపల్లి గ్రామాలలో భూమి పూజలు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు,

స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్  మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు,

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మహిళలు యువత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు,      

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గనుగోని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు షేక్ గాఫర్, వాసరవేని దేవయ్య,షేక్ మహబూబ్, గొల్లపల్లి మల్లేశం, గోని నాగరాజ్, జహీర్ సంతోష్, ఇమ్మడి బాబు, సంపంగి స్వామి, ఎలిగే శ్రీకాంత్, సూర నవీన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

.