సెస్ ను రద్దు చేసి ఎన్ పీడీసీఎల్ , ఎస్ పిడిసిఎల్ లో కలపాలి

భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధి ద్యాప దేవయ్య  డిమాండ్

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): సిరిసిల్ల సెస్ లో అనేక అవినీతి ఆక్రమాలు జరుగుతున్నందున వెంటనే  సెస్ ను రద్దుచేసి ఎన్.పి.డి.సి.ఎల్, ఎస్ పిడిసిఎల్  లో కలపాలని భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర ప్రతినిధి ద్యాప దేవయ్య డిమాండ్ చేశారు,

ఎల్లారెడ్డిపేట మండలం లో వివిధ అభివృద్ధి పనులకు  భూమి పూజ చేయడానికి  శుక్రవారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి అందుకు సంబంధించిన ఒక వినతి పత్రాన్ని ద్యాప దేవయ్య అందజేశారు,

టి ఎస్ ఈ ఆర్ సి హైదరాబాద్ కమీషన్ సెక్రెటరీ  సిరిసిల్ల సెస్ పై విచారణ జరిపి తేదీ 21-0 2-20 24 నాడు నివేదిక తయారుచేసి తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ కి అందజేసిన  జిరాక్స్ కాపీలను  దేవయ్య సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి శుక్రవారం అందజేశారు, 

94 8871851 రూపాయల నష్టంతో సిరిసిల్ల సెస్ ఉందని కమీషనర్ సెక్రెటరీ నివేదిక లో తెలిపిందని ఆయన జిరాక్స్ కాపీలను దేవయ్య చూపించారు, 

అక్కడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య,  నాయకులు బండారి బాల్ రెడ్డి , తదితరులు ఉన్నారు,

.