ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలి

భూ సంబంధిత ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

మెద‌క్ అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు

తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెద‌క్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్నప‌ట్టా భూమి కొల‌త‌ల ద‌ర‌ఖాస్తుదారుల ఆర్జీల‌ను అధికారులు స‌త్వ‌ర‌మే ప‌రిష్కరించాల‌ని జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ వేంక‌టేశ్వ‌ర్లు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం ఏడి సర్వే ల్యాండ్ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు శివకుమార్ శేఖర్ వర్మ సుజాత ఫారెస్ట్ సూపరిండెంట్ సంబంధిత మండల సర్వేయర్లతో పట్టా భూమి కొలతల కొరకై దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు విషయంలో, ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీస్, ప్రభుత్వ భూములను గుర్తించడం సంబంధిత విషయాలపై అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు సుదీర్ఘంగా చర్చించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 259 ఎఫ్ లైన్ దరఖాస్తులు పెండింగ్లో  దరఖాస్తులు మాత్రమే క్లియర్ చేయడం జరిగిందని, పెండింగ్లో ఉన్న పట్టా భూమి కొలతల దరఖాస్తులను సాధ్యమైనంత తొందరలో పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల గుర్తింపు వేగం పెంచాలని  సర్వేలో ఏదైనా సమస్య నెలకొని రిజెక్ట్ చేసిన పక్షంలో దీనికి సంబంధించిన సమాచారం క్లియర్ గా తమ దగ్గర ఉంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో నివేదికలు పక్కాగా ఉండాలని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు అందిన పక్షంలో ఉపేక్షించేది లేదని సర్వేయ‌ర్ల‌ను హెచ్చరించారు.  సర్వే చేసేటప్పుడు బౌండరీస్ పక్కాగా నమోదు చేయాలని వీటితో పాటు రెవెన్యూ స్కెచ్, గూగుల్ మ్యాప్ తప్పనిసరని తెలిపారు.  అసైన్డ్ భూముల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం జరుగుతున్నాయ‌ని వాటిపై దృష్టి సారించాలన్నారు. ఫారెస్ట్ బౌండరీ డిస్ట్రిబ్యూట్స్ పై ఫారెస్ట్, ల్యాండ్ సర్వే సమన్వయంగా వ్యవహరించాలని చెప్పారు. సర్వేయర్లు సర్వే చేసేటప్పుడు మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ గా గుర్తించాలని ఆ భూమి నేషనల్ హైవే, ఆర్ అండ్ బి రోడ్ ఎంత దూరంలో ఉన్నదనేది గూగుల్ మ్యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు సర్వే యాక్ట్ అమలు చేయాలన్నారు. డాష్ బోర్డ్ చెకింగ్ ప్రకారం ఏ సర్వేయర్ దగ్గర ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయనేది పరిశీలన చేసుకోవాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్  శివకుమార్ ను ఆదేశించారు. వచ్చే సమావేశంలో ఈ సమస్యలపై పురోగతి కనిపించాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

.