మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత, విద్యార్థులు నడుం బిగించాలి : ఎస్సై సుధాకర్

యాంటి డ్రగ్స్ అవగాహన రన్ ను విజయవంతం చేయండి - ఎస్సై సుధాకర్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); మాదక ద్రవ్యనిర్మూలనకు యువత, విద్యార్థులు నడుం బిగించాలని తంగళ్ళపల్లి ఎస్సై డి సుధాకర్ అన్నారు.యాంటి డ్రగ్ అవేర్నెస్ లో భాగంగా మార్చ్ మూడో తారీఖున నిర్వహించనున్న 5కే రన్ ను విజయవంతం చేయాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలంలో గల వ్యవసాయ కళాశాల మరియు షెడ్యూల్ తెగల గురుకుల డిగ్రీ కళాశాలలో  రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న 5K

రన్ పోస్టర్ ను కళాశాలల అధ్యాపకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టిందని, యువత డ్రగ్స్ కు బానిస కావద్దని, డ్రగ్స్ వినియోగించే వారిపై విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించనున్న 5కే రన్ కు పెద్ద ఎత్తున యువతీ, యువకులు తరలిరావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు కళాశాలల ప్రిన్సిపల్ లు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

.