తెలంగాణ ప్రభ ( మెదక్ ): ఆర్థిక సమస్యలతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం అజ్జమర్రిలో జరిగింది. ఏఎస్ఐ మిస్బావోద్ధిన్ తెలిపిన వివరాల ప్రకారం అజ్జమర్రి గ్రామానికి చెందిన అతినారం పోచయ్య (42) మిషన్ భగీరథ వాటర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పొలం పనికి వెళ్ళిన పోచయ్య మధ్యాహ్నం లక్ష్మయ్య అనే వ్యక్తికి ఫోన్ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేశాడు. కాగా పోచయ్య తన పొలం వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుని భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మిస్బావోద్దిన్ తెలిపారు. మృతిచెందిన మిషన్ భగీరథ లైన్ మెన్ పోచయ్యకు సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు . మృతి చెందిన కార్మికుల కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
