జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా

శ్రీనివాస్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా యూనియన్ అభినందనలు

తెలంగాణ ప్రభ (సంగారెడ్డి): హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా సాక్షి నెట్వర్క్ ఇంచార్జ్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా టియూడబ్ల్యూజేయు అధ్యక్షులు బండారు యాదగిరి అభినందించారు. గ్రామీణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను సాధించి పెట్టిన శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో జర్నలిస్టులు అందరికీ మేలు కలుగుతుందని ఆకాంక్షించారు. శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి 

రేవంత్ రెడ్డికి, సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా 

రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హన్మంతురావు, అంతర్ రాష్ట్ర మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు విరాహాత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ.కే పైసల్  పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేకమంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందలేదని, హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి  దృష్టికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి  తీసుకొచ్చారు.

.