ధర్మపురి(తెలంగాణ ప్రభ): ఉపాధి కోసం అప్పులు చేసి ఉన్న ఊరు , కుటుంబాన్ని వదిలిపెట్టి సౌదీ వెళ్ళిన గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందగా మృతుడి కుటుంబానికి సామాజిక మిత్రులు రూ . 1.10.లక్షలు సాయం అందించి ఔదార్యం చాటుకున్నారు
ధర్మపురి మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన పులిశెట్టి రాజన్న కు ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సౌదీకి వెళ్తూ పోలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గతేడాది అప్పులు చేసి ఇద్దరి కూతుళ్ళ వివాహం జరిపించగా, అప్పులు తీర్చడం కోసం పది నెలల క్రితం మరోసారి సౌదీ కి వెళ్ళాడు.
దురదృష్టవశాత్తు 3 నెలల క్రితం రాజన్నకు పక్షవాతం సోకగా , అక్కడే జనవరి లో మరణించాడు.
గల్ఫ్ బాధితుడి కుటుంబ ఆర్థిక సమస్యల్ని తెలుసుకున్న ధర్మపురి కి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి మృతుని కుటుంబానికి సాయం అందించాలని ఫిబ్రవరి 4న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
ఫేస్ బుక్ పోస్ట్ కు స్పందించిన ఎన్నారై లు మృతుడి భార్య లక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ. 1.10 లక్షలు విరాళాలు అందించారు.
వాటి నుండి భవిష్యత్ ఖర్చులకు రూ 30 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించగా పిక్స్ డిపాజిట్ బాండ్లను కొంత నగదును యూనియన్ బ్యాంకు మేనేజర్ రవితేజ చేతుల మీదుగా పంపిణీ చేయించాడు. మిగతా డబ్బులు భవిష్యత్ ఖర్చులకు లక్ష్మి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్నట్లు రమేష్ తెలిపాడు.
.