ఎమ్మెల్యే ని కలిసిన తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు..

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్  ఆధ్వర్యంలో గత నెలలో గచ్చిబౌలిలో నిర్వహించిన  తెలంగాణ ఉమెన్స్ ఛాంపియన్షిప్, తెలంగాణ మెన్స్ ఛాంపియన్షిప్, ఓవరాల్ ఛాంపియన్షిప్  మార్చ్ ఫస్ట్ పోటీల్లో  తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని తన నివాసంలో అసోసియేషన్ లైఫ్ అధ్యక్షుడు మర్రి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవితంలో మన ఆరోగ్యం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు అథ్లెటిక్ క్రీడా ఒక జీవిత భాగస్వామి అయిందని, ప్రతి ఒక్కరూ ఈ  క్రీడలను నేర్చుకునేందుకు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రభు కుమార్, ట్రెజరర్ డి.లక్ష్మి రామస్వామి, సునీల్, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

.