వాటర్ పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నిజాంపేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్28,30వ డివిజన్ పరిధిలో రూ 10లక్షల వ్యయంతో హెచ్ఎండబ్ల్యూఎస్, మెగా ఓఆర్ఆర్ ఫేస్ -2 వారు నూతనంగా చెప్పాడుతున్న పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పైప్ లైన్ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను  ఆదేశించారు. గత కొద్ది రోజులుగా  28,30 వ డివిజన్ లో ప్రజలకు మంజీరా నీటి సమస్య మెయిన్ లైన్ జామ్ అవడం వల్ల నూతనంగా పైప్ లైన్ పనులు చేపడుతున్నారు దీనివల్ల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ లైన్ మెన్ లు సమరసింహారెడ్డి, మేకల బాలకృష్ణ, మునిసిపల్ ఇంజనీర్ రవి , కాంట్రాక్టర్ , తదితరులు పాల్గొన్నారు.

.