మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మీడియా అకాడమీ చైర్మన్ గా గురువారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి కి   టియుడబ్ల్యూజే (ఐజేయు) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల పక్షపాతి జర్నలిస్టుల కోసం నిరంతరం పాటుపడిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పడం ఎంతో సంతోషమని అన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటరామిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి కుత్బుల్లాపూర్ మేడిపల్లి ఉప్పల్ ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.