94 శాతం విద్యార్థుల హాజరు
తెలంగాణ ప్రభ ( మెదక్ ): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు మెదక్ జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ముగిసాయి.
మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 6471 గాను 6113 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 584 గాను 529 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. జిల్లాలో మొదటి రోజు హాజరు 94 శాతంగా నమోదైంది. ఈ సంవత్సరం కూడా నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ రమేష్
జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయినా ఇంటర్ పరీక్ష కేంద్రాలను బుదవారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సందర్శించారు. కౌడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్, TSRWS జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏలాంటి ఇబ్బందులు కలగకుండా, విద్యుత్, త్రాగునీరు, మెడికల్ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు
