మెడికల్ కాలేజ్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్):గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ రద్దు నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పర్యావరణ ప్రేమికుడు సామాజిక కార్యకర్త కోలా రవీందర్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా పదివేల 9 19 ఓట్లతో మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని పార్లమెంటుకు పంపింది కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ప్రజలు కాదా,  అలాంటి కుత్బుల్లాపూర్ ప్రజలకు మీరు అన్యాయం చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఎక్కువగా జనాభా కలిగిన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి మంజూరైన మెడికల్ కాలేజ్ ని మీరు రద్దు చేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ వివేకానంద అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంతో మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మెడికల్  కాలేజ్ ని మంజూరు చేపిస్తే మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇకనైనా మీరు మెడికల్ కాలేజ్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కుత్బుల్లాపూర్ ప్రజల మేలుకోరే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

.