తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): దుండిగల్ మున్సిపాలిటీ పరిధి సారెగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వసుధారా ఫెర్టిలిటీ & స్పెషాలిటీ హాస్పిటల్ ను బుధవారం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ ఫెర్టిలిటీ హాస్పిటల్ ల ఏర్పాటుతో సంతానలేమి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, పిల్లలు లేని తల్లిదండ్రులు ఈ ఫెర్టిలిటీ హాస్పిటల్ లను వినియోగించుకొని తల్లిదండ్రులు కావాలనే తమ కోరికను నెరవేర్చుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమరం గోపాల్ రెడ్డి, సాయి యాదవ్, దుండిగల్ మండలం బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొల్తూరి మల్లేష్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీశైలం ముదిరాజ్, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎస్. వసుధాన, డాక్టర్ బి. ధనుంజయ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
.