తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ లో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్, పెన్నులు గిఫ్ట్ గా పంపడం జరిగింది.వాటిని విద్యార్థిని విద్యార్థులకు, అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు,
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న, మాజీ ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి,హెడ్మాస్టర్ శంకర్ నారాయణ,ఎస్ఎంసి చైర్మన్ కందుకూరి రామ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్,
హమీద్ రమేష్, సహెదా బేగం, భానుమూర్తి, అనిల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
.