తెలంగాణ ప్రభ (నర్సాపూర్):నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని బ్రాహ్మణ కూడా గ్రామానికి చెందిన జంగయ్య గత ఆరు సంవత్సరాల క్రితం పక్షవాతంతో కాలు చేయి పడిపోగా సదరం సర్టిఫికెట్ గురించి మీసేవ చుట్టూ తిరిగిన స్లాట్ బుక్కు కాలేదు. దీంతో సునీతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు శివశంకర్ రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి సోమవారం స్లాట్ బుక్ చేయించి అనంతరం ఆయన మంగళవారం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుకు తీసుకెళ్లి సర్టిఫికెట్ మంజూరు చేయించడం జరిగింది. ఏళ్ళ తరబడి ఉన్న సమస్యను తొందరగా పరిష్కరించినందుకు శివ శంకర్ రావుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
