తెలంగాణప్రభ ( నర్సాపూర్): నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం రైతు వేదిక భవనంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు యూనిఫాం బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేకున్నా అంగన్వాడి కేంద్రం నడిపిస్తున్న టీచర్లకు ఆయలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే కోట కింద సొంత భావనాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చి తీర్చిదిద్దిన ప్రత్యేక సంస్థ మన అంగన్వాడీ కేంద్రమని అన్నారు. జీవితంలో సహజ మానవులు ఎవరైనా విద్యా అంగన్వాడి తోటే మొదలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఐసిడిఎస్ సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, అంగన్వాడీలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
