తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మొహమ్మద్ లాయక్, వైస్ ప్రెసిడెంట్లుగా రహీం ఖాన్, మోయిన్, మున్నా, అంజద్, రెహానా బేగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా షేక్ కలీం, జి.కిష్టా రెడ్డి, బి.అనిల్ రెడ్డి, ఎండి. అమీర్ అలీ, జనరల్ సెక్రటరీలుగా షేక్ అహ్మద్, డి.శ్రీనివాస రావు, జి.శ్రీలత జాయింట్ సెక్రెటరీగా ఎస్.కె. అహ్మద్, కె. వెంకటేష్, సిహెచ్.వంశీ, అసిఫ్, అజర్, సెక్రటరీలు గా అసిఫ్ మౌలానా, జాఫర్, వహీద్, లక్ష్మి ట్రెజరర్ విజయ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గురు ప్రసాద్, శ్యామ్, సంగ్రామ్, బేబీ, భరత్, మహమ్మద్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి తెలియజేసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.
