గ్రామదేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలలో భాగం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ దేవాలయం 20వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  మాట్లాడుతూ పురాణాల నుంచి మహిళలను గ్రామదేవతలు, శక్తి స్వరూపాలుగా పూజించడం భారతదేశ సంస్కృతిలో ఒక భాగమని, అమ్మవార్లను పూజించడం ద్వారా ప్రజలంతా చీడపీడలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వేణు యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బెగ్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు గంగయ్య, శ్యాంసుందర్, గూగుల్ ప్రసాద్, పిఎస్ సాయిలు, రాము, హనుమంతు, గంగారాం, చిన్న,వీరన్న, మూసా ఖాన్, నారాయణ, అరుణ్, నవీన్, జునైధ్ తదితరులు పాల్గొన్నారు.

.