ఘనంగా కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్  జన్మదిన వేడుకలు  డివిజన్ కార్యాలయంలో  అభిమానులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. అనంతరం  ఎన్టీఆర్ నగర్  ప్రజలు  కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని తనపై మీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.