ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కగా అమలు చేస్తాం

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కగా అమలు చేస్తామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి,గృహాలక్ష్మి పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.మాట ఇచ్చామంటే అమలు చ తప్ప  బిఆర్ఎస్ పార్టీ లాగా  ప్రజలను మభ్యపెట్టమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ లను అమలు చేస్తారని  అన్నారు.ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కొందరు జీర్ణించుకోలేక అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నేరల్ల నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

.