జీవో 317 సవరణ హర్షదాయకం

రాష్ట్ర టీఎన్జీవోల అధ్యక్షుడు మారం జగదీశ్వర్

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోల డైరీ ఆవిష్కరణ 

తెలంగాణ ప్రభ (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా TNGOs డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా అధ్యక్షులు ఎం.డీ జావీద్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా రాష్ట్ర టీఎన్జీవో  అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడారు. జి.ఓ. 317ని సవరించడానికి చైర్మన్ గా జిల్లా మంత్రి దామోదర రాజానర్సింహాను నియమించి సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ని నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్జీవోల  పక్షాన కృతజ్ఞతలు  తెలిపారు.

జిల్లా అధ్యక్షులు ఎండి జావీద్ అలీ మాట్లాడుతూ ఉద్యోగుల ఇండ్ల జాగాల కొరకు 30 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని  విజ్ఞప్తి చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఇండ్ల స్థలాలు ఇప్పించుటకై తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, జిల్లా టీఎన్జీవో కార్యదర్శి వి.రవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు నరేందర్, కార్యదర్శి రాజకుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి.వెంకట్ రెడ్డి, కోశాధికారి G.శ్రీనివాస్, రాష్ట్ర HWO అధ్యక్షులు గౌస్ హష్మీ, పంచాయతీ కార్యదర్శిల రాష్ట్ర అధ్యక్షులు మహేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిర్మల రాజకుమారి, జల్లా కార్యవర్గ సభ్యులు సుదామని, మమత, భాస్కర్, వి.విజయ్ కుమార్, షకీల్, వివిధ తాలుకాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారు.

.